మంత్రి సత్యవతి రాథోడ్‌కు అస్వస్థత 

తెలంగాణ గిరిజన శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సత్యవతి రాథోడ్‌కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఆమె పాల్గొన్నారు.