చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత

చికెన్  బిర్యానీ తిన్నయువకుడికి  అస్వస్థత
  • నేరెడ్ మెట్ గ్రీన్ బావర్చీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
  •  సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తింపు.. నోటీసులు జారీ 

మల్కాజిగిరి, వెలుగు:  నేరెడ్‌‌‌‌‌‌‌‌మెట్ కు చెందిన రవి అనే యువకుడు అదే ప్రాంతంలో ఉన్న గ్రీన్ బావర్చీ హోటల్‌‌‌‌‌‌‌‌ కు వెళ్లి చికెన్ బిర్యానీ తిని వాంతులు చేసుకున్నాడు. మంగళవారం గ్రీన్ బావర్చిలో బిర్యానీ తిన్న యువకుడు ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే  విపరీతంగా వాంతులు చేసుకోగా కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  

బిర్యానీ తిన్న తర్వాతే  ఫుడ్​ పాయిజన్​అయినట్లు  వైద్యుల ద్వారా తెలియడంతో  సదరు యువకుడు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎక్స్​లో ఫిర్యాదు చేశారు. బాధితుడి  ఫిర్యాదుపై స్పందించిన  జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు  గ్రీన్ బావర్చి రెస్టారెంట్లో తనిఖీలు చేశారు. బిర్యానీలో సింథటిక్​  కలర్స్​వాడుతున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. హోటళ్లలోని ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు టెస్టులకు పంపించారు.