ఓరుగల్లు కోటలో..ఇల్యూమినేషన్​ లైటింగ్​ సిస్టమ్​ ప్రారంభం

కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లులోని కాకతీయుల రాజధాని ఖిల్లా వరంగల్​ కోటలో ఏర్పాటు చేసిన ఇల్యూమినేషన్​​ లైటింగ్​ సిస్టమ్​ను గురువారం రాత్రి కేంద్ర  మంత్రి కిషన్​ రెడ్డి, రాష్ర్ట పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ   ప్రారంభించారు. ఈ సందర్భంగా  మంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడుతూ..  ఓరుగల్లులోని చారిత్రాత్మకమైన కాకతీయుల కళా వైభవాన్ని కాపాడుకుందామని అన్నారు.    

సౌండ్​ అండ్​ లైటింగ్​ షో ప్రదర్శన జరిగే విధంగా చూస్తామని, ప్రధాని మోదీ చొరవతోనే రామప్ప ఆలయానికి యూనెస్కో గుర్తింపు దక్కిందని తెలిపారు. రూ.62కోట్లతో రామప్ప ఆలయాన్ని అభివృద్ది చేస్తామన్నారు.  రూ.80కోట్ల తో ఇప్పటికే ములుగు జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలను అభివృద్ది చేశామని గుర్తు చేశారు.  అనంతరం రాష్ర్ట మంత్రి సురేఖ మాట్లాడుతూ కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా..  వరంగల్ జిల్లా అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.  అనంతరం  మంత్రి కొండా సురేఖను  కిషన్​ రెడ్డి సత్కరించారు.  ఈ కార్యక్రమంలో , ఎంపీపసునూరి దయాకర్​, శాసన మండలి డిప్యూటి చైర్మన్​ బండా ప్రకాశ్​ ,  బీజేపీ   లీడర్లలు ఎర్రబెల్లి ప్రదీప్​ రావు, గంట రవికుమార్​, కుసుమ సతీష్​, కాంగ్రెస్​   నాయకులు, తదితరులు పాల్గొన్నారు.