ఓ వైపు ఆస్ట్రేలియా గడ్డపై బిగ్ బాష్ లీగ్.. మరోవైపు సఫారీ గడ్డపై సౌతాఫ్రికా టీ20 లీగ్.. ఇప్పుడు ఈ రెండింటికి పోటీగా అరబ్బుల అడ్డా యూఏఈ, అబుదాబి, షార్జాలు వేదికగా ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్(IL T20) మొదలుకానుంది. క్రికెట్ అభిమానులకు పండుగే కదా...! ఐపీఎల్‌లో ఆడే పలువురు అంతర్జాతీయ స్టార్లు ఈ టోర్నీలో కనిపించనున్నారు.
శుక్రవారం (జనవరి 19) నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ 30 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. మొత్తం 34 గేమ్‌లు.. మూడు వేదికల్లో జరగనున్నాయి. దుబాయ్ 15, అబుదాబి 11, షార్జా 8 మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
ఎక్కడ చూడాలంటే..?
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 మ్యాచ్‌లన్నీ ‘జీ’ ఛానెల్‌లలో చూడొచ్చు. జీ పీక్చర్స్, జీ సినిమా, జీ అన్మోల్ సినిమా, జీ జెస్ట్, జీ సినిమాలు వంటి ఛానెల్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారాలున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.
పాల్గొనే మొత్తం జట్లు: 6
- షార్జా వారియర్స్ (కాప్రి గ్లోబల్)
- గల్ఫ్ జెయింట్స్ (కాప్రి గ్లోబల్)
- దుబాయ్ క్యాపిటల్స్ (GMR)
- ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్)
- డిజర్ట్ వైపర్స్ (లాన్సర్ క్యాపిటల్)
- అబుదాబి నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
మ్యాచ్‌లు జరిగే వేదికలు
- షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం (దుబాయ్)
- అబుదాబి అంతర్జాతీయ స్టేడియం (అబుదాబి)
- షార్జా క్రికెట్ స్టేడియం (షార్జా)
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ షెడ్యూల్
జనవరి 19: షార్జా వారియర్స్ vs గల్ఫ్ జెయింట్స్ (షార్జా)
జనవరి 20: దుబాయ్ క్యాపిటల్స్ vs ఎంఐ ఎమిరేట్స్ (దుబాయ్)
జనవరి 21: డెసర్ట్ వైపర్స్ vs అబుదాబి నైట్ రైడర్స్ (దుబాయ్)
ఎంఐ ఎమిరేట్స్ vs గల్ఫ్ జెయింట్స్ (అబుదాబి)
జనవరి 22: దుబాయ్ క్యాపిటల్స్ vs షార్జా వారియర్స్ (దుబాయ్)
జనవరి 23: అబుదాబి నైట్ రైడర్స్ vs ఎంఐ ఎమిరేట్స్ (అబుదాబి)
జనవరి 24: గల్ఫ్ జెయింట్స్ vs డెసర్ట్ వైపర్స్ (దుబాయ్)
జనవరి 25: దుబాయ్ క్యాపిటల్స్ vs అబుదాబి నైట్ రైడర్స్ (దుబాయ్)
జనవరి 26: షార్జా వారియర్స్ vs ఎంఐ ఎమిరేట్స్ (షార్జా)
జనవరి 27: అబుదాబి నైట్ రైడర్స్ vs డెసర్ట్ వైపర్స్ (అబుదాబి)
గల్ఫ్ జెయింట్స్ vs దుబాయ్ క్యాపిటల్స్ (షార్జా)
జనవరి 28: ఎంఐ ఎమిరేట్స్ vs అబుదాబి నైట్ రైడర్స్ (అబుదాబి)
డెసర్ట్ వైపర్స్ vs షార్జా వారియర్స్ (షార్జా)
జనవరి 29: షార్జా వారియర్స్ vs దుబాయ్ క్యాపిటల్స్ (షార్జా)
జనవరి 30: డెసర్ట్ వైపర్స్ vs ఎంఐ ఎమిరేట్స్ (దుబాయ్)
జనవరి 31: అబుదాబి నైట్ రైడర్స్ vs గల్ఫ్ జెయింట్స్ (అబుదాబి)
ఫిబ్రవరి 01: దుబాయ్ క్యాపిటల్స్ vs డెసర్ట్ వైపర్స్ (దుబాయ్)
ఫిబ్రవరి 02: ఎంఐ ఎమిరేట్స్ vs షార్జా వారియర్స్ (అబుదాబి)
ఫిబ్రవరి 03: డెసర్ట్ వైపర్స్ vs గల్ఫ్ జెయింట్స్ (దుబాయ్)
అబుదాబి నైట్ రైడర్స్ vs దుబాయ్ క్యాపిటల్స్ (అబుదాబి)
ఫిబ్రవరి 04: ఎంఐ ఎమిరేట్స్ vs డెసర్ట్ వైపర్స్ (అబుదాబి)
గల్ఫ్ జెయింట్స్ vs షార్జా వారియర్స్ (దుబాయ్)
ఫిబ్రవరి 05: షార్జా వారియర్స్ vs అబుదాబి నైట్ రైడర్స్ (షార్జా)
ఫిబ్రవరి 06: దుబాయ్ క్యాపిటల్స్ vs గల్ఫ్ జెయింట్స్ (దుబాయ్)
ఫిబ్రవరి 07: అబుదాబి నైట్ రైడర్స్ vs షార్జా వారియర్స్ (అబుదాబి)
ఫిబ్రవరి 08: గల్ఫ్ జెయింట్స్ vs ఎంఐ ఎమిరేట్స్ (దుబాయ్)
ఫిబ్రవరి 09: డెసర్ట్ వైపర్స్ vs దుబాయ్ క్యాపిటల్స్ (దుబాయ్)
ఫిబ్రవరి 10: గల్ఫ్ జెయింట్స్ vs అబుదాబి నైట్ రైడర్స్ (దుబాయ్)
MI ఎమిరేట్స్ vs దుబాయ్ క్యాపిటల్స్ (అబుదాబి)
ఫిబ్రవరి 11: షార్జా వారియర్స్ vs డెసర్ట్ వైపర్స్
ఫిబ్రవరి 13: TBC vs TBC, క్వాలిఫైయర్ 1 (దుబాయ్)
ఫిబ్రవరి 14: TBC vs TBC, ఎలిమినేటర్ (అబుదాబి)
ఫిబ్రవరి 15: TBC vs TBC, క్వాలిఫైయర్ 2 (షార్జా)
ఫిబ్రవరి 17: TBC vs TBC ఫైనల్ (దుబాయ్)
జట్లు - ఆటగాళ్లు
గల్ఫ్ జెయింట్స్: జేమ్స్ విన్స్ (కెప్టెన్), అయాన్ అఫ్జల్ ఖాన్, కార్లోస్ బ్రాత్‌వైట్, క్రిస్ జోర్డాన్, క్రిస్ లిన్, డొమినిక్ డ్రేక్స్, గెర్హార్డ్ ఎరాస్మస్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, జోర్డాన్ కాక్స్, కరీం జనత్, మహ్మద్ జోహైబ్ జుబేర్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, రెహాన్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, సంచిత్ శర్మ, సౌరభ్ నేత్రవాల్కర్, షిమ్రాన్ హెట్మెయర్, ఉస్మాన్ ఖాన్.
డిజర్ట్ వైపర్స్: కోలిన్ మున్రో (కెప్టెన్), ఆడమ్ హోస్, అలెక్స్ హేల్స్, అలీ నసీర్, ఆర్యన్ లక్రా, ఆజం ఖాన్, బాస్ డి లీడే, దినేష్ చండిమల్, గుస్ అట్కిన్సన్, కార్తీక్ మెయ్యప్పన్, ల్యూక్ వుడ్, మతీష పతిరన, మైఖేల్ జోన్స్, రోహన్ ముస్తఫా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, షెల్డన్ కాట్రెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, టామ్ కర్రాన్, వానిందు హసరంగా, టామ్ కర్రాన్.
ఎంఐ ఎమిరేట్స్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), అకేల్ హోసేన్, ఆండ్రీ ఫ్లెచర్, ఆసిఫ్ ఖాన్, కోరీ ఆండర్సన్, డేనియల్ మౌస్లీ, డ్వేన్ బ్రేవో, ఫజల్హక్ ఫారూఖీ, జోర్డాన్ థాంప్సన్, కుశాల్ పెరీరా, మెకెన్నీ క్లార్క్, రషీద్ ఖాన్, ముహమ్మద్ వసీం, నికోలస్ పూరన్, నోస్తుష్ కెంజిగే, ఓడియన్ స్మిత్, ట్రెంట్ బౌల్ట్, విజయకాంత్, వకార్ సలాంఖీల్, విల్ స్మీడ్, జహూర్ ఖాన్.
దుబాయ్ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఆండ్రూ టై, దాసున్ శనక, దుష్మంత చమీర, హైదర్ అలీ, జో రూట్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, ముహమ్మద్ మొహ్సిన్, నువాన్ తుషార, రహ్మానుల్లా గుర్బాజ్, రాహుల్ చోప్రా, రాజా అకిఫ్, రోవ్మాన్ పావెల్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్, సికందర్ రజా, వృత్య అరవింద్.
షార్జా వారియర్స్: బాసిల్ హమీద్, క్రిస్ సోల్, క్రిస్ వోక్స్, డేనియల్ సామ్స్, దిల్షాన్ మధుశంక, జేమ్స్ ఫుల్లర్, జో డెన్లీ, జాన్సన్ చార్లెస్, జునైద్ సిద్ధిక్, కుసాల్ మెండిస్, లూయిస్ గ్రెగొరీ, మహేష్ తీక్షణ, మార్క్ దేయల్, మార్క్ వాట్, మార్టిన్ గప్టిల్, ముహమ్మద్ జవదుల్లా, నీలాన్ష్ కేశ్వాని, కైస్ అహ్మద్, సీన్ విలియమ్స్, టామ్ కోహ్లర్-కాడ్మోర్.
అబుదాబి నైట్ రైడర్స్: సునీల్ నరైన్ (కెప్టెన్), ఆదిత్య శెట్టి, అలీ ఖాన్, అలీషన్ షరాఫు, ఆండ్రీ రస్సెల్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, చరిత్ అసలంక, డేవిడ్ విల్లీ, జేక్ లింటోట్, జో క్లార్క్, జోష్ లిటిల్, లారిన్ ఎవాన్స్, మార్చంట్ డిలాంగే, మతియుల్లా ఖాన్, మైఖేల్ పెప్పర్, రవి బొపారా, సబీర్ అలీ, సామ్ హుస్సేన్.