యూపీ ఎలక్షన్స్: రామ మందిరం ఫొటోలతో స్పెషల్ చీరలు

కాన్పూర్: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార హోరుతో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఈ విషయాన్ని అటుంచితే.. ఎన్నికల సమయంలో జెండాలు, ఫ్లెక్సీల వ్యాపారులకు మంచి గిరాకీ ఉంటుంది. అదే టైమ్ లో ఇతర వ్యాపారాలకు డిమాండ్ ఉంటుందనే చెప్పాలి. ఈ డిమాండ్ దృష్ట్యా ఓ యువ వ్యాపారి కొత్తగా ఆలోచించాడు. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలతో ప్రత్యేక చీరలను రూపొందించాడు. ఈ చీరలపై రామ మందిరం ఫొటోలను కూడా వేశామని.. 10 వేల శారీ బాక్సులను సిద్ధం చేశామని ఆ వ్యాపారి తెలిపాడు.

 

కాగా, ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి తాయిలాలు ఇవ్వడం కామన్ గా మారింది. నేతల ఫొటోలు, పార్టీల గుర్తులతో కొన్ని వస్తువులను పంచడం గురించి వినే ఉంటాం. కొన్ని సందర్భాల్లో పార్టీ గుర్తులతో టీవీలు, మిక్సీలు ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి.