మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) క్షమాపణలు చెప్పారు. తాను కావాలని ఏ వ్యాఖ్యలు చేయలేదని, వాటి వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నాగబాబు రిలీజ్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీ మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయిథేబె ఈ ఈవెంట్ లో భాగంగా నాగబాబు మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీశాయి. ఈ ఈవెంట్ లో నాగబాబు సినిమాలో పాత్ర గురించి మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ ఈ సినిమాలోని పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇలాంటి పోలీస్ పాత్రలు 6.3 హైట్ ఉన్నవాళ్లు చేస్తే బాగుంటుంది కానీ. 5.3 హైట్ ఉన్నవాళ్లు చేస్తే అంత నమ్మశక్యంగా ఉండదు.. అంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి… pic.twitter.com/Ppr44YcqI8
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 29, 2024
దీంతో ఓ హీరో అభిమానులు తమ హీరోను కావాలనే టార్గెట్ చేసి హైట్ గురించి మాట్లాడారని సోషల్ మీడియాలో నాగబాబుపై, మెగా ఫ్యామిలీ పై ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో స్పందించిన నాగబాబు తన ట్విట్టర్ లో నైట్ విడుదల చేశారు.. ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6.3 హైట్ ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది, 5.3 హైట్ వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టుగా మాట్లాడాను. ఆ మాటలు వెనక్కి తీస్కుంటున్నాను. ఆ మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అది ఏటీపీ ఫ్లోలో వచ్చిందే కానీ, ఎవరిని ఉద్దేశించింది కాదు. అర్ధం చేసుకుని క్షమిస్తారని భావిస్తున్నాను.. అంటూ నోట్ రాసుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు రాసిన ఈ నోట్ నెట్టింట వైరల్ గా మారింది.