కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రామాలను దత్తత తీసుకుని సంపూర్ణ వైద్యం అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కరీంనగర్ చాప్టర్'ఆవో.. గావ్ చలో' (గ్రామాలకు వెళ్దాం) అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఆదివారం నుంచి 22 మంది డాక్టర్లు 22 గ్రామాలను దత్తత తీసుకుని వైద్య సాయం అందించాలని నిర్ణయించారు. వీరిలో డాక్టర్ వెంకట్ రెడ్డి(కల్లెడ గ్రామం), డాక్టర్ వంశీధర్ రెడ్డి (తాడికల్), డాక్టర్ కార్తీక్(చామన్‌పల్లి), డాక్టర్ శరత్ కుమార్(గట్టుబుత్కూరు), డాక్టర్ విజయకుమార్,
డాక్టర్ శివ కుమార్ (తోటపల్లి), డాక్టర్ అరుణ్ కటారి (సిరికొండ), డాక్టర్ ప్రదీప్(కొదురుపాక) , డాక్టర్ నరేందర్ సైని(కూనపెల్లి), డాక్టర్ చాందిని(వెల్గటూర్), డాక్టర్ శేష శైలజ(గుంజపడుగు), డాక్టర్ ఎం.విజయలక్ష్మి (రామకృష్ణ కాలనీ), డాక్టర్ శివకుమార్(రామడుగు), డాక్టర్ తిరుపతి(చొప్పదండి), డాక్టర్ అశ్విన్(నర్సింగాపూర్), డాక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు(బురహనియాపేట్), డాక్టర్ నిఖిల్(లింగాపూర్), డా.సత్యనారాయణ రెడ్డి(పొల్లంపల్లి), డాక్టర్ జె సురేష్ (గుమ్లాపూర్) ఉన్నట్లు కరీంనగర్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రామ్‌కిరణ్ పొలాస, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.