
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రముఖ మెజీషియన్ సామల వేణుకు మరో పురస్కారం దక్కింది. ఇండియన్ మ్యాజి క్ అకాడమీ (ఐఎంఏ) ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (గోల్డెన్ మెజీషియన్ అవార్డు) ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ మెజీషియన్ డే సందర్భంగా ఏపీలోని విశాఖపట్నంలో కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సామల వేణుకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడంపై పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.