- నెవార్క్‌లోని ఓ మసీదు బయట ఘటన
నెవార్క్ : న్యూజెర్సీలో దారుణం చోటుచేసుకుంది. మసీదు బయట ఓ ఇమామ్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. న్యూజెర్సీ స్టేట్‌లోని అతిపెద్ద సిటీ నెవార్క్‌లో మస్జిద్ -మహమ్మద్ మసీదు దగ్గర్లో ఉదయం 6 గంటలకు ఇమామ్ హసన్ షరీఫ్ తన కారులో వెళ్తుండగా.. దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు.
షరీఫ్.. ఐదేండ్లుగా స్థానిక మసీదులో రెసిడెంట్ ఇమామ్‌గా కొనసాగుతున్నారని నెవార్క్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ ఫ్రిట్జ్ ఫ్రాగే తెలిపారు. సర్వమత సమాజంలో లీడర్ గా కూడా పనిచేశారని పేర్కొన్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, నిందితుల సమాచారం తెలిసిన వారు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.