రెండ్రోజుల్లో పెళ్లి.. మరో మహిళతో పాక్ క్రికెటర్ ప్రైవేట్ చాటింగ్

రెండ్రోజుల్లో పెళ్లి.. మరో మహిళతో పాక్ క్రికెటర్ ప్రైవేట్ చాటింగ్

పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్, మాజీ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్‌ ఉల్‌ హక్ మరో రెండ్రోజుల్లో పెళ్లి పీటలకెక్కనున్నాడు. నార్వేకు చెందిన తన చిరకాల ప్రేయసి అన్మోల్ మెహమూద్‌ను వివాహమాడనున్నాడు. వీరిద్దరి నిఖా శనివారం(నవంబర్‌ 25) నార్వేలో జరగనుంది. ఇప్పటికే ఆ దిశగా పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను వధువు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఎవరీ అందగత్తె

ఇమామ్‌ మనువాడనున్న అన్మోల్ మెహమూద్ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. ఆమె ఒక డాక్టరట. ప్రస్తుతం ఆమె తన కుటంబ సభ్యులతో కలిసి నార్వేలో నివసిస్తుంది. నార్వే​కు వెళ్లకముందు ఈ  అమ్మడు కొన్నాళ్లు పాకిస్తాన్‌లో గడిపిందని సమాచారం. ఈ క్రమంలో ఇమామ్‌తో పరిచయం ఏర్పడి.. పెళ్ళికి దారితీసిందట. మీడియా నివేదికల ప్రకారం.. వీరి వివాహానికి బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్‌తో సహా పలువురు పాకిస్తానీ క్రికెటర్లు హాజరుకానున్నారని సమాచారం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HSY (@theworldofhsy)

మంచి కళాకారుడే..!

ఇదిలావుంటే, మరికొన్ని గంటల్లో పెళ్లనగా.. ఇమామ్ మరో మహిళతో చేసిన ప్రైవేట్ చాట్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అందులో ఈ పాక్ క్రికెటర్ మంచి కళాకారుడు అని నిరూపించుకున్నాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మరో మహిళను ప్రేమిస్తే.. ఇవేం పనులని నెటిజన్స్ అతన్ని ప్రశ్నిస్తున్నారు.