ఏపీలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రెండు, మూడురోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాల పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.శ్రీకాకుళం,మన్యం,అల్లూరి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వరద ప్రవహించే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది ఐఎండీ.
వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు, గొర్రెల కాపరులు చెట్లు కింద ఉండొద్దని హెచ్చరించింది.ఇదిలా ఉండగా, గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో
137మిమీ అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.18 ప్రాంతాల్లో భారీ వర్షాలు, 85 ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదైనట్లు తెలిపింది వాతావరణశాఖ.