రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ నెల 13న కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాకాతంలో రుతుపవనాలు బలంగా ఉన్న కారణంగా దక్షిణ కోస్తా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది వాతావరణశాఖ.రానున్న 48గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నాడు అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా,సోమవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కోస్తాలో మిగిలినచోట్ల ఉక్కపోత, ఎండ తీవ్రత కొనసాగింది.