
కలికాలం అంటే ఇదేనేమో.. ఎండలు మండిపోతున్న ఈ సమ్మర్ లో అప్పటికప్పుడే వాతావరణం మారిపోతోంది.. ఉన్నట్టుండి వర్షం కురుస్తోంది. ఈ మధ్యకాలంలో తరచూ ఇదే పరిస్థితి. అకాల వర్షం మండే ఎండల నుంచి రిలీఫ్ ఇస్తున్నప్పటికీ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక సిటీ జనాలకు ఈ వర్షం ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్ ఇస్తోంది కానీ.. వర్షం కురిసే సమయంలో రోడ్లపై ఉన్నోళ్లకు మాత్రం వాటర్ లాగింగ్స్, ట్రాఫిక్ జాంతో నరకం కనపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ జనాలకు వర్షం కురిస్తే ప్రత్యక్ష నరకమే అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. గురువారం ( ఏప్రిల్ 10 ) హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.
Also Read : తెలంగాణలో మరో వారం వింత వాతావరణం
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కూకట్ పల్లి, బాచుపల్లి, మూసాపేట్, ఎస్సార్ నగర్, మియాపూర్ కొండాపూర్, లింగంపల్లి, మాదాపూర్, మదీనాగూడ చందానగర్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది వాతావరణ శాఖ.
ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. రోడ్లపై తెరిచి ఉన్న మ్యాన్ హొల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వర్ష ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేవారు వర్షం తగ్గేంతవరకు ఆగి వెళ్లడం మంచిది.