హైదరాబాద్ సిటీకి వార్నింగ్.. భారీ వర్షం పడే సూచనలు

హైదరాబాద్ సిటీకి వార్నింగ్.. భారీ వర్షం పడే సూచనలు

రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.  రాష్ట్రంలో ఈరోజు జూలై 8  2024 నాడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు వీచే అవకాశం అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన జల్లులు మెరుపులు,ఈదురు గాలుల వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇలాగే రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ వెల్లడించింది .

 జూలై 12 వరకు బలమైన ఉపరితల గాలులు వచ్చే అవకాశం ఉన్నందున, డిపార్ట్‌మెంట్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల్లో ఇప్పటి వరకు తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 175.6 మిల్లీమీటర్లకు వ్యతిరేకంగా 210.6 మిల్లీమీటర్లు నమోదైంది.జోగులాంబ గద్వాల్‌లో అత్యధికంగా 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. 

ఇదిలా ఉండగా, నగరంలో సాధారణ వర్షపాతం 173.5 మిమీ నమోదైంది.  రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ హెచ్చరిక జారీ చేసింది.