హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. 6.45 సెంటీమీటర్ల నుంచి 11.55 సెంటీమీటర్ల వర్షం కురిచే ఛాన్స్ ఉందని తెలిపింది. రెండు రోజులుగా కురుస్తున్న ముసురు కంటిన్యూ అవుతుందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8–30 గంటల వరకు అత్యధికంగా బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 8.28 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గచ్చిబౌలి 7.78, కేపీహెచ్ బీ 7.68, హెచ్ సీయూ 7.65 సెంటిమీటర్లు పడింది. అలాగే ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు పట్టికలో చూడొచ్చు.
ఏరియాలు వర్షపాతం
అంబర్ పేట్ 4.68
హిమాయత్ నగర్ 4.25
హైదర్ నగర్ 4.58
గచ్చిబౌలి 4.03
హెచ్ సీయూ 3.93
కుత్బుల్లాపూర్ 4.15
కేపీహెచ్ బీ 4.05
ఖైరతాబాద్ 3.43
సరూర్ నగర్ 3.50
షేక్ పేట్ 3.50
బీహెచ్ ఈఎల్ 3.70