హైదరాబాదీలు జాగ్రత్త.. మరో నాలుగురోజులు వర్షాలు..  ఎల్లో అలర్ట్ జారీ..

భాగ్యనగరం హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ( ఆగస్టు 13, 2024 ) తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ తో నగరం స్తంభించిపోయింది. ఆఫీసులు, స్కూళ్లకు వెళ్ళటానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఆగస్టు 17 ( ఆదివారం ) వరకు ఓ మోస్తరు నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

Also Read:-వామ్మో.. మన ఉప్పుతో ఇంత ముప్పుందా.. అయోడైజ్డ్ వాడుతుంటే అర్జెంట్గా..

హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాలు, జగిత్యాల, జె.భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, హన్మకొండ, ములుగు, ఎం. మల్కాజిగిరి, జనగాం, మహబూబాబాద్, బి.కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.