తెలంగాణకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ వార్నింగ్

తెలంగాణకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2024, ఆగస్ట్ ఒకటో తేదీ సాయంత్రం తర్వాత పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది వెదర్ డిపార్ట్ మెంట్.

ఇక హైదరాబాద్ సిటీలోనూ మోస్తరు వానలు పడతాయని.. సిటీ శివారు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా ఉంటాయని.. వర్షం సమయంలో చెట్ల కిందకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్ట్ 4వ తేదీ వరకు తెలంగాణతోపాటు హైదరాబాద్ సిటీలోనూ ఇలాంటి వాతావరణమే ఉంటుందని.. అక్కడక్కడ భారీ వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు.. ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని వివరించింది వాతావరణ శాఖ. 

నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 364 మిల్లీమీటర్లుగా ఉంటే.. ఇప్పటి వరకు 461 మిల్లీమీటర్ల వర్షపాతనం నమోదైంది.. ఇది సాధారణం కంటే 27 శాతం అధికంగా అని స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.