తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండు, మూడురోజుల పాటు కొనసాగుతాయని సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ( జూలై 17, 18, 2024 ) పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉందని, పలు జిల్లాల్లో 11 నుండి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు  సంబంధించిన అధికారులను అలెర్ట్ చేసింది ఐఎండీ.

Also Read:-తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు