Rain alert: తెలంగాణలో మళ్లీ వర్షాలు పడే అవకాశం

Rain alert:  తెలంగాణలో మళ్లీ వర్షాలు పడే అవకాశం

తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది.  ఏప్రిల్​ 7, 8  తేదీలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.  ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం  హైదరాబాద్​ వాతావరణ శాఖ  పేర్కొంది.  మంగళవారం  ( ఏప్రిల్​ 8) సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.

తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని తెలిపారు.