తెలంగాణలో పలు జిల్లాలకు రేయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 2024, ఫిబ్రవరి 25న ఏడు జిల్లాలు, ఫిబ్రవరి 26న మరో మూడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందన్న వాతవారణశాఖ...ఇప్పటికే రెయిన్ ఎఫెక్ట్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జల్లులకు అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ్టి నుంచి రేపటివరకు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.