Weather Alert: ఏపీలో మళ్ళీ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మరో బాంబు పేల్చింది వాతావరణ శాఖ. ఏపీలో  మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.పశ్చిమ గోదావరి, ఏలూరు అల్లూరి, తూర్పూగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు  రావద్దని సూచిందింది. ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణంగా విజయవాడకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని శనివారం ( సెప్టెంబర్ 7, 2024 ) అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.