భారీవర్షాలతో పుణె మొత్తం మునిగిపోయింది..ఎక్కడ చూసినా నడుములోతు నీళ్లు

భారీవర్షాలతో పుణె మొత్తం మునిగిపోయింది..ఎక్కడ చూసినా నడుములోతు నీళ్లు

రుతు పవనాల ఉధృతి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. రుతు ప్రవనాల ప్రభావంతో జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడా లేకుండా భారీ వర్షాలు ముంచెత్తు తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై, పుణె నగరాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా నడుములోతు నీళ్లు కనిపిస్తున్నాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది.భారీ వర్షాలు,వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.  గురువారం నాటివర్షాలకు ఇప్పటికే నలుగురు చనిపోయారు. పాల్ఘర్ జిల్లాలోని వాడా, విక్రమ్‌గడ్ తో పాటు రాయ్‌గఢ్ , అలీబాగ్‌లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.  

మహారాష్ట్రలో భారీవర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గురువారం జూలై 25, 2024 నాడు కురిసిన వర్షాలకు పుణె, ముంబై వంటి నగరాలు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. భారీ వర్షాల కారణంగా పుణె, కొల్హాపూర్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. 

పుణె సిటీతో పాటు పింప్రి, చించ్వాడ్, వెహ్లే, మావల్ ముల్షి, ఖదడక్వాస్లా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాల కారణంగా పుణెలో గురువారం నలుగురు వ్యక్తులు చనిపోయారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముంబై, పుణె, సబర్బన్ థానే, పాల్ఘర్ లో  ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 

డెక్కన్ జింఖాన్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున వరదలో ఉన్న హ్యాండ్ కార్ట్ తీసుకునే ప్రయత్నంలో ముగ్గురు వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతిచెందారు. అభిషేక్ ఘనేకర్, ఆకాష్, మానే, శివ పరిహార్ తోపుడు బండ్లపై ఆహార పదార్థాలు అమ్ముతుంటారు.. గురువారం కూడా తమ హ్యాండ్: కార్ట్ లను తీసుకునే ప్రయత్నంలో విద్యుత్ షాక్ తో మృతి చెందారు. వర్షాల కారణంగా మావల్ ప్రాంతంలోని అదర్ వాడిలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతిచెందారు.