తెలంగాణాలో గత రెండుమూడు రోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఐఎండీ రిపోర్ట్ ప్రకారం (మార్చి 28)న నిన్న రాష్ట్రంలోకి వడగాల్పులు ప్రవేశించి.. ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. భారత వాతావరణ శాఖ మార్చి 27 నుంచి 29 వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. సాధారణం ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే ఈరోజు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగనున్నాయి.
నిన్న రాష్ట్రం వ్యాప్తంగా తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, నారాయణపేట, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్, హనుమకొండ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగి వేడి గాలులు వ్యాపించాయి. ఈరోజు ఇంచుమించూ అదే తరహాలో ఎండ తీవ్రత ఉండనుందని ఐఎండీ పేర్కొంది.