తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ( డిసెంబర్ 7) అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలలో మేఘావృతం ఏర్పడుతుందని, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయువ్య దిశగా పయనించిరుతి బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ 12వ తేదీ నాటికి శ్రీలంక - తమిళనాడు తీరాల వద్దకు చేరుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. డిసెంబర్ 11వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. . కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో చల్లటి గాలులు వీచే అవకాశం ఉంది.
వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 12 నాటికి తమిళనాడు- శ్రీలంక తీర రేఖను చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
Also Read:-రైతులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఈజీగా వ్యవసాయ రుణాలు
దీని ప్రభావంతో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని కొన్ని ప్రాంతాలు, అలాగే దాని శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ వాతావరణ మార్పులు 12, 13 తేదీల్లో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఐఎండీ హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళనలు చెందుతున్నారు. మొన్నటి వరకు తుఫాన్ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడ్డారు.