బంగాళాఖాతంలో అల్పపీడనం : రాబోయే 4 రోజులు ఎండలు, వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం :  రాబోయే 4 రోజులు ఎండలు, వానలు

గత వారంలో కురిసిన వర్షాలతో ఎండల నుంచి కాస్త రిలీఫ్ దక్కిన్నప్పటికీ.. రెండు రోజుల నుంచి ఎండలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడ్డ అల్పపీడనం మరో నాలుగురోజుల వర్షాలను వెంటపెట్టుకొస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ( ఏప్రిల్ 7 ) దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం ( ఏప్రిల్ 8 ) నాటికి వాయవ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. 

ఆ తర్వాత 48 గంటలపాటు ఉత్తరంవైపు  ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే ఛాన్స్ ఉందని పేర్కొంది వాతావరణశాఖ. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులపాటు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం ఉన్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు రాబోయే 4 రోజుల పాటు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగి, ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతాయని తెలిపింది . ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 2 నుంచి 4 డిగ్రీలు పెరిగి, ఆ తర్వాత స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ.