దేశవ్యాప్తంగా హీట్ వేవ్ కొనసాగుతుంది. ఏప్రిల్ 30 వరకు దక్షిణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇటీవలె భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్ మరియు మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో ఆకాశం మేఘాకృతమై తేలికపాటి వర్షాలు పడతాయని ఆదివారం వెల్లడించింది.
మధ్యప్రదేశ్‌లో మెరుపులు మరియు వడగళ్లతో కూడిన తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. తమిళనాడు, తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మహారాష్ట్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.