
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.
వినియోగం పెరగడంతో పాటు, ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండడంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఇండియా జీడీపీ 6.5 శాతం గ్రోత్ నమోదు చేస్తుందని పేర్కొంది. కేంద్రం కూడా 2024–25 లో 6.5 శాతం జీడీపీ గ్రోత్ నమోదు చేస్తామని అంచనా వేస్తోంది.
పెట్టుబడులను ఆకర్షించడానికి, జాబ్స్ క్రియేట్ చేయడానికి లేబర్ సంస్కరణలు అవసరమని ఐఎంఎఫ్ పేర్కొంది.