- ఆర్థిక వృద్ధిలో భారత్ కొంత వీక్నెస్
- చిన్న దేశాల పరిస్థితి అధ్వానం
- ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జీవా
వాషింగ్టన్డీసీ: ఇండియన్ ఎకానమీ 2025లో కొంత బలహీనంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. యూఎస్ట్రేడ్ పాలసీలతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి కొనసాగొచ్చని పేర్కొన్నారు. ‘ఆర్థికవృద్ధిలో మేం ముందుగా అంచనా వేసిన దాని కన్నా యూఎస్ కొంత మెరుగ్గానే ఉంది.
ఈయూ వెనకబడింది. భారత్ లో కొంత వీక్నెస్ కనిపిస్తోంది. వ్యవసాయం, గ్రామీణ వినియోగం దన్నుగా నిలుస్తుంది. బ్రెజిల్ కొంత ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవచ్చు. చైనాలో మాత్రం డీఫ్లేషన్ కొనసాగుతోంది. చిన్న దేశాల పరిస్థితి అధ్వానం’ అన్నారు.