
న్యూఢిల్లీ: ఇండియా, శ్రీలంక క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మరోసారి గ్రౌండ్‌లోకి వచ్చి అభిమానులను అలరించనున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ టోర్నమెంట్‌లో ఇండియాకు సచిన్, లంక జట్టుకు సంగక్కర కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
మాజీ క్రికెటర్లతో కూడిన పలు దేశాలుబరిలో నిలిచిన ఈ టోర్నీ ఈ నెల 22 నుంచి మార్చి 16 వరకు ముంబై, వడోదర, రాయ్‌పూర్ వేదికల్లో జరగనుంది. సచిన్ కెప్టెన్సీలోని ఇండియా మాస్టర్స్ జట్టులో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు బరిలో నిలిచారు. మరోవైపు శ్రీలంక మాస్టర్స్ టీమ్ డాషింగ్ ఓపెనర్ రమేశ్ కలువితరణ, పేసర్ సురంగ లక్మల్, ఉపుల్ తరంగ ఉన్నారు.