పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించండి..రైల్వే జీఎంతో కాంగ్రెస్ ఎంపీలు భేటీ

పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించండి..రైల్వే జీఎంతో కాంగ్రెస్ ఎంపీలు భేటీ

హైదరాబాద్, వెలుగు: తమ నియోజకవర్గాల్లో చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్​ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కోరారు. బుధవారం సికింద్రాబాద్ లోని  సౌత్ సెంట్రల్ రైల్వే కార్యాలయంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తో కాంగ్రెస్ ఎంపీలు రఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య భేటీ అయ్యారు. ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న  నియోజకవర్గాల్లో రైల్వే అండర్ పాస్ లు బ్రిడ్జీల నిర్మాణం, రైళ్ల రాకపోకల్లో మార్పులు, కాజీపేట జంక్షన్ ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గకుండా రైల్వే పరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీలు రైల్వే జీఎంను కోరారు.