- సిటీలో డివిజన్ల వారీగా వాట్సాప్ గ్రూప్ లు
- ఓటు వేసి చాలెంజ్ చేస్తూ ఫొటో పోస్ట్ చేయాలని
- యూఎఫ్ఆర్డబ్ల్యూఏఎస్ పిలుపు
- సిటిజన్లలో కొంతైనా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం
- ఈసారి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందన్న ప్రెసిడెంట్ శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: ఓటర్లలో ఉత్సాహాన్ని పెంచేందుకు సిటీలో లోక్ సభ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు యునైటెడ్ ఫెడరేషన్ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్అసోషియేషన్స్(యూఎఫ్ఆర్డబ్ల్యూఏఎస్) వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటేసిన వెంటనే ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకొని ఆయా కాలనీ వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేయాలని సూచించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్చాలెంజ్ ప్రోగ్రామ్ నిర్వహించామని, ఈ ఎన్నికల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని యూఎఫ్ఆర్డబ్ల్యూఏఎస్ ప్రెసిడెంట్టీబీ శ్రీనివాస్తెలిపారు.
డివిజన్ల వారీగా వాట్సాప్ గ్రూపులు
గ్రేటర్ సిటీలోని 4,800 కాలనీల్లో ఓటింగ్తక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను ఎంచుకొని డివిజన్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్లో ఓటు చాలెంజ్ ఫొటోలను పోస్ట్ చేయాలని యూఎఫ్ఆర్డబ్ల్యూఏఎస్ పిలుపునిచ్చింది. ఒక్కో డివిజన్ గ్రూప్లో దాదాపు వెయ్యి మంది ఉంటారని, సోమవారం ఓటేసిన వెంటనే ఒక్కరున్నా, ఫ్యామిలీతో అయినా... ప్రౌడ్ ఓటర్ అనే ట్యాగ్ తో ఫొటోలను పోస్టు చేయాలని గ్రూప్ సభ్యులకు సూచించింది. ఓటు వేసిన వారు ఇతరులకు చాలెంజ్ చేయాలని, దీని ద్వారా వారు ఇన్ స్పైర్ అవుతారని పేర్కొంది.
ముఖ్యంగా యువతలో ఓటు వేసేవారిని ఈ చాలెంజ్ ఎక్కువగా ఆకర్షింస్తుందని, ఒకరిని చూసి మరొకరు.. పోస్టులు చేసుకుంటారని చెబుతున్నారు. దీనితో కొంతైనా ఓటింగ్ శాతం పెరుగుతుందని అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. కాగా, సిటీలో పోలింగ్శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. వాటితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్చేపట్టాయి. స్వీప్(ఎస్వీఈఈపీ) సహకారంతో యూఎఫ్ఆర్డబ్ల్యూఏఎస్ కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపడుతుంది.