కాంగ్రెస్ దే కుటుంబ పాలన , కుటుంబాల వ్యవస్థ అని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో తెలంగాలో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపు, యాదవ, ముదిరాజ్ , రజక, విశ్వబ్రాహ్మణ , కుర్మా , వడ్డెర సామాజికవర్గాలకు చోటు ఎందుకు దక్కలేదని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వంలో కనీసం ఒక్కరైనా బీసీ సలహాదారులు ఉన్నారా నిలదీశారు. ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ సలహాదారులు లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు కవిత.
బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ గణన జరగాల్సిందేనని అన్నారు కవిత... ఏ కులంలో ఎంత మంది ఉన్నారో లెక్క తేలాల్సిందేనని చెప్పారు. ఈ డిమాండ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నదేనని. పార్లమెంట్ ఎన్నికల ముందు బీసీ కులగణన లేవనెత్తిన రాహుల్ గాంధీ .. ఆనాడు మీరు చేసిన కులగణన లెక్కలు తొక్కిపెట్టిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు.
పార్లమెంట్ లో ఉన్న పూలే విగ్రహం అసెంబ్లీలో ఉంటే తప్పేందని కవిత ప్రశ్ని్ంచారు. ఆనాడు అంబేద్కర్ బొమ్మ గారి కొట్లాడిన మేమే ఇప్పుడు పూలే విగ్రహం కోసం కొట్లాడుతున్నామని చెప్పారు. బహుజనుల కోసం కొట్లాడిన పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉంటే ఇబ్బంది ఏంటన్నారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో వెంటనే ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.