సింగరేణి సమ్మర్ క్యాంప్స్

సింగరేణి సమ్మర్ క్యాంప్స్
  • క్రీడల్లో కార్మికుల పిల్లలకు ప్రత్యేక తర్ఫీదు    
  • నేటి నుంచి 25 రోజులపాటు శిక్షణా శిబిరాలు
  • సింగరేణి వ్యాప్తంగా 52 కోచింగ్​క్యాంపులు
  • నిర్వహణకు ఫండ్స్ కేటాయింపు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ ఏటా కార్మికుల పిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్​క్యాంపులు నిర్వహిస్తున్నది. ఆయా క్రీడల్లో అనుభవం ఉన్న కోచ్​ల ద్వారా ఫ్రీ కోచింగ్​ఇప్పిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి 11 ఏరియాల్లోని కార్మిక క్షేత్రాల్లో నేటి నుంచి సమ్మర్ స్పోర్ట్స్​క్యాంపులు ప్రారంభం కానున్నాయి. సమ్మర్​క్యాంపుల కోసం సింగరేణి సంస్థ స్టేడియాలు, గ్రౌండ్స్​ను రెడీ చేసింది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో అనుభవం కలిగిన కోచ్​ల ఎంపిక చేయగా, మరికొన్ని చోట్ల ప్రక్రియ తుది దశకు చేరింది.  

12 క్రీడాంశాలు.. 25 రోజుల కోచింగ్ 

సింగరేణి యాజమాన్యం శనివారం నుంచి 11 ఏరియాల పరిధిలో 52 సమ్మర్ స్పోర్ట్స్​క్యాంపులను ప్రారంభించాలని ఆదేశించింది. అయితే, కొన్ని ఏరియాల్లో రెండు, మూడు రోజుల్లో క్యాంపులు ప్రారంభించే ఛాన్స్​ ఉంది.18 ఏండ్ల లోపు కార్మికుల పిల్లలకు 12 క్రీడాంశాలల్లో 25 రోజుల పాటు ( మే 20 వరకు)  ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. సీనియర్​ప్లేయర్స్, పీఈటీలు, స్టేట్, నేషనల్​స్థాయిలో రాణించిన క్రీడాకారులను కోచ్​లుగా నియమించింది. వీరికి 25 రోజులకు గాను రూ.3,400 ప్రోత్సాహకంగా అందించనుంది. డబ్ల్యూపీఎస్​అండ్​జీఏ గౌరవ కార్యదర్శి, అసిస్టెంట్​ సూపర్​వైజర్లు పర్యవేక్షణలో కోచింగ్​శిబిరాలు నడవనున్నాయి.

క్యాంపులకు ఫండ్స్ మంజూరు

కోచింగ్​కోసం అవసరమైన స్పోర్ట్స్​మెటీరియల్​ను స్థానికంగా కొనుగోలు చేయాలని  ఏరియా యాజమాన్యాలకు కార్పొరేట్ ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. స్పోర్ట్స్​మెటీరియల్​కు రూ.1,10,700, కో​చ్​లకు రూ.1,76,800 ఫండ్స్​ సాంక్షన్​ చేసింది. ఒక్కో క్రీడాంశానికి 20 నుంచి 35 మంది స్టూడెంట్లకు కోచింగ్​ఇవ్వడం, వారికి రిఫ్రెష్​మెంట్, టిషర్ట్స్​ కోసం మరో రూ.6,40,500 ఫండ్స్​ను మంజూరు చేసింది. వీటితో పాటు కోచింగ్​ క్యాంపుల ప్రారంభం, ముగింపు వేడుకలకు మొత్తంగా 25 రోజుల పాటు నిర్వహించే సమ్మర్​ స్పోర్ట్ క్యాంపులకు రూ.  9,83,000 ఫండ్స్​ మంజూరు చేసింది. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్​ స్పోర్ట్స్ క్యాంపుల్లో కొత్తగా సాఫ్ట్​బాల్​ ను కూడా చేర్చాలని కార్మికులు కోరారు. కార్మికుల పిల్లలతో పాటు ప్రభావిత ప్రాంత విద్యార్థులకు కూడా చాన్స్​ఇవ్వడంతో పాటు మరికొన్ని చోట్ల క్యాంపుల ఏర్పాటుకు డిమాండ్​ఉన్నా సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఎక్కడెక్కడ ఏ కోచింగ్​ అంటే..

ఫుట్​బాల్​: కొత్తగూడెం, కొత్తగూడెం కార్పొరేట్, మణుగూరు, ఇల్లందు, రామగుండం1,2,3 ఏరియాలు, భూపాలపల్లి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియా
వాలీబాల్:  ఇల్లందు ఏరియా మినహా 10 ఏరియాలు 
అథ్లెటిక్స్: కొత్తగూడెం కార్పొరేట్, మణుగూరు, రామగుండం-1, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కొత్తగూడెం, మందమర్రి ఏరియా
బాస్కెట్​బాల్: మందమర్రి, కార్పొరేట్, ఎల్లందు, రామగుండం1,2, మణుగూరు, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాలు
బాక్సింగ్: కొత్తగూడెం కార్పొరేట్, రామగుండం1, శ్రీరాంపూర్​
కరాటే: రామగుండం1, మణుగూరు
కిక్​బాక్సింగ్: కొత్తగూడెం
వూషూ: కొత్తగూడెం కార్పొరేట్
ఆర్చరీ: రామగుండం1, 3 ఏరియాలు
హ్యాండ్​బాల్: భూపాలపల్లి
హాకీ క్రీడ: కొత్తగూడెం, రామగుండం- 3 ఏరియాలు
డ్రాయింగ్: కొత్తగూడెం కార్పొరేట్​ఏరియా