బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధరలు తగ్గించండి..ఉద్యోగాలు పెంచండి

బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధరలు తగ్గించండి..ఉద్యోగాలు పెంచండి
  • బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ తగ్గించడంపై ఫోకస్ పెట్టాలి
  • వంట నూనెలపై సుంకాలు తగ్గాలి
  • ఉద్యోగుల జీతాలు పెరగాలి..ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెండిచర్ పెంచాలి
  • కేంద్రాన్ని కోరుతున్న ప్రజలు 

న్యూఢిల్లీ: దేశంలో కూరగాయలు, వంట నూనె వంటి రోజువారి వాడే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  ధరలు  భారీగా పెరిగాయి. రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధరల పెరుగుదల (ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ను  కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సామాన్య  ప్రజలు కేంద్రాన్ని కోరుతున్నారు. ఒకవైపు పెరిగిన ధరలు , మరోవైపు చాలీచాలని జీతాలు మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్ ప్రజలపై గుది బండాల మారాయి.  దీంతో వినియోగం పడిపోతోంది. కంపెనీల లాభాలు తగ్గుతున్నాయి.  ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదిస్తోంది. నిరుద్యోగం తగ్గించేందుకూ రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్యలు చేపట్టాలని  ప్రభుత్వానికి  ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. 

బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కామన్ మ్యాన్ అంచనాలు..

1) పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుంకాలు తగ్గాలి

కూరగాయలు, వంట నూనె, పాలు, బిస్కెట్‌‌లు వంటి  ప్రతిరోజు వాడే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలు భారీగా పెరిగాయి.  వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడంతో కూరగాయల ధరలు పెరగగా, ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడంతో వంట నూనె ధరలు పెరిగాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో పాలు రేట్లు గరిష్టాలకు చేరుకున్నాయి. బిస్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సబ్బులు, పేస్టులు వంటి ప్యాకేజ్డ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలు పెరగడంతో కుటుంబాలపై భారం ఎక్కువైంది.

 పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముడిసరుకుగా వాడే చాలా ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలు పెరిగాయి. రానున్న నెలల్లో వీటి ధరలు మరింత పెరుగుతాయని కంపెనీలు సంకేతాలిస్తున్నాయి. వంట నూనెల దిగుమతులపై సుంకాలు తగ్గిస్తే వీటి ధరలను తగ్గించొచ్చు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ కాస్ట్ దిగొస్తుంది. ప్రజలు రోజువారీ వాడే కొన్ని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలు తగ్గుతాయి. 

2)  జీతాలు పెంపు అంతంతే

ఇండియాలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ ఏడాదికి సగటున 5 శాతం చొప్పున పెరుగుతుంటే ఇదే రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఉద్యోగుల జీతాలు పెరగడం లేదు. కంపెనీల్లోని  జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్ ఉద్యోగుల జీతాల పెంపు నెమ్మదించడంతో  వినియోగం పడిపోయిందని ఎనలిస్టులు చెబుతున్నారు. గత 12 నెలల్లో ఉద్యోగుల జీతాలు సగటున 6.5 శాతం పెరిగితే,  నాన్ శాలరీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వర్కర్ల  జీతాలు కేవలం 3.4 శాతమే  పెరిగాయని బ్రిటానియా తన సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కామెంట్ చేసింది. 

2019–2023 మధ్య  ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు జీతాలు ఏడాదికి సగటున 0.8 శాతమే పెరిగాయని, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు జీతాలు 5.4 శాతం పెరిగాయని క్వస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిక్కీ కలిసి విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. కరోనా తర్వాత కంపెనీల లాభాలు భారీగా పెరిగినా, వీటిపై ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తగ్గినా ఉద్యోగుల జీతాల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదని వెల్లడించింది.  

3) ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.4 శాతం వృద్ధి చెందుతుందని నేషనల్ స్టాటిస్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ) అంచనా వేసింది. ప్రభుత్వం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై చేస్తున్న ఖర్చులను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెండిచర్ పెంచితే  సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ మెషినరీలకు డిమాండ్ పెరుగుతుంది.  వీటిని తయారు చేసే కంపెనీలు పూర్తి కెపాసిటీతో పనిచేస్తాయి. తయారీ సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఫలితంగా మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ సెక్టార్లలో మరిన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి.   ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చేసే క్యాపిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెండిచర్ చాలా ముఖ్యం.

4) ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈలకు ప్రోత్సాహకాలు

కరోనా సంక్షోభం టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోట్ల మంది  సిటీల నుంచి గ్రామాలకు తిరిగొచ్చారు. వీరిలో ఎక్కువ మంది  వ్యవసాయ పనుల్లో చేరారు. సిటీల నుంచి గ్రామాలకు వెళ్లిన వారిలో చాలా మంది  ఇంకా సిటీలకు వలస వెళ్లలేదని, పట్టణాల్లో పనులు  దొరకకపోవడమే ఇందుకు కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. పనిచేయగలిగే వారు పెరుగుతున్నా, పనులు దొరకడం లేదని  అన్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెండిచర్ పెంచడంతో పాటు, ప్రైవేట్ కంపెనీలు లేబర్స్ ఎక్కువగా అవసరముండే సెక్టార్లలో ఇన్వెస్ట్ చేయడంతో చాలా మందికి ఉపాధి కల్పించొచ్చు. మీడియం, మైక్రో, స్మాల్ కంపెనీల( ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈల) కు  ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, సపోర్ట్ చేయడానికి వివిధ చర్యలు తీసుకోవాలి. 

5) ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తగ్గించాలి..

జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ వంటి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైరెక్ట్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్రం పెద్దగా మార్చలేకపోవచ్చు. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ కౌన్సిల్ మారుస్తుంది. కానీ, రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వంట నూనె దిగుమతులపై  సుంకాలు తగ్గించాలని, పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై వేసే ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను క్రమబద్దీకరించాలని, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మినహాయింపును పెంచితే ప్రజల దగ్గర డబ్బులు మిగులుతాయని, అప్పుడు వినియోగం పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.