టెన్త్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ పై కరోనా లీవ్స్ ప్రభావం..?

టెన్త్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ పై కరోనా లీవ్స్ ప్రభావం..?

ఆకస్మిక సెలవులతో మారిన ప్రణాళికలు
కొన్ని సబ్జెక్టుల్లో వీక్ ఉన్నోళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం
ప్రత్యామ్నాయ ప్రణాళికల్లో ప్రైవేట్‍ విద్యా సంస్థలు

టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. హాల్‍ టికెట్లను వెబ్ సైట్ పెట్టడంతో పాటు స్కూళ్లకు పంపించారు. కరోనా వైరస్‍ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సెలవుల కారణంగా టెన్త్ ఎగ్జామ్స్ చివరి రోజుల్లో స్టూడెంట్స్ ప్రిపరేషన్ వెనుకపడే అవకాశం ఉందని నిపుణులు, పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు. గవర్నమెంట్‍ స్కూళ్లలో మార్చి 16 తేదీకల్లా రివిజన్‍ పూర్తి చేశామని విద్యాశాఖ అధికారి తెలిపారు. సెలవులు ప్రకటించడంతో టెన్త్ స్టూడెంట్స్ ఇంటికి పరిమితమై చదువును నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. చివరి మూడు రోజులు టెన్త్ స్టూడెంట్స్ కు స్పెషల్‍ క్లాస్‍లు ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు.

ఇప్పటికే టెన్త్ స్టూడెంట్స్ కు రివిజన్‍ పూర్తి చేశారు. ప్రాక్టిస్‍ టెస్ట్ లు, ప్రీ ఫైనల్‍ ఎగ్జామ్స్ నిర్వహించారు. అయితే ఈ ఎగ్జామ్స్ లో కొన్ని సబ్జెక్టుల్లో వీక్ గా ఉన్న కొందరిపై ప్రత్యేకంగా ఫోకస్‍ పెట్టామని చివరి మూడు రోజులు వారికి స్పెషల్‍ క్లాస్‍లు తీసుకోవాలని అనుకున్నామని, ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ఇప్పుడు ఏమి చేయాలో తోచడం లేదని ఓ ప్రైవేట్‍ స్కూల్ పని చేసే మ్యాథ్స్ టీచర్‍ వాపోయారు. గవర్నమెంట్‍ స్కూళ్లల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. స్టూడెంట్స్ ను పాస్‍ చేయించే బాధ్యత భుజాలపై వేసుకున్న కొందరు సబ్జెక్టు టీచర్లు, వెనుక బడ్డ స్టూడెంట్స్ పై ఎలా ఫోకస్‍ పెట్టలా అని ఆలోచన చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వారు ఫెయిలైతే పరిస్థితి ఏంటని వాపోతున్నారు. కనీసం టెన్త్ స్టూడెంట్స్ వరకైనా స్పెషల్‍ క్లాస్‍లు ఏర్పాటు చేసేందుకు విద్యా శాఖాధికారులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.

సందేహాల నివృత్తికి..

స్కూళ్లలో 1–9 వ తరగతి వరకు దాదాపు సిలబస్‍ను పూర్తి చేశారని విద్యాశాఖా అధికారి ఒకరు చెప్పారు. ఏప్రిల్‍ 7 నుంచి వార్షిక ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో వారు రివిజన్‍ చేసుకునేందుకు టైం దొరకడం కష్టమేనన్నారు. ఇప్పటికే సిలబస్‍ పూర్తి చేసిన కొన్ని ప్రైవేట్‍ స్కూల్స్ రివిజన్‍ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మార్చి చివరి,ఏప్రిల్‍ ఫస్ట్ వీక్ రివిజన్‍ చేయించేందుకు టైం దొరుకుతుందని భావించిన టీచర్లు.. సెలవులతో రివిజన్‍ చేయించేందుకు సమయం దొరకదని భావిస్తున్నారు. టెన్త్ ఎగ్జా మ్స్ కు ముందు సబ్జెక్టు టీచర్లను అందుబాటులో ఉంచేలా ప్రైవేట్‍ స్కూల్‍ మేనేజ్ మెంట్లు ఆలోచన చేస్తున్నాయి. దీంతో ఇంట్లో ప్రిపరేషన్‍ టైంలో ఏమైనా సందేహాలుంటే వారు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

మినహాయింపు ఇయ్యాల్సింది

జిల్లాలో 2,893 గవర్నమెంట్‍, ప్రైవేట్‍ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో దాదాపు 72 వేల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయనున్నారు. వీరికి తోడు మరో 10 వేల మంది ప్రైవేట్‍ స్టూ డెంట్స్ ఎగ్జా మ్స్ కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్‍ స్కూళ్లలో రెండు సార్లు రివిజన్ లు పూర్తి చేసినట్లు ఓ స్కూల్‍
ప్రిన్సిపల్‍ తెలిపారు. ప్రభుత్వం హాలీడేస్‍ ప్రకటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్కూల్స్ మూసి వేయాల్సిందేనన్నారు. అయితే సంక్షేమ, రెసిడెన్ షియల్‍ హాస్టళ్లలో టెన్త్ స్టూడెంట్స్ కు మినహాయింపు ఇచ్చారని, అదే విధంగా స్పెషల్‍ క్లాస్‍లు నిర్వహించుకునేలా ప్రైవేట్‍ స్కూళ్లకు అనుమతి
ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.

ఇంట్లో చదివే పరిస్థితులు కల్పించాలె

గవర్నమెంట్‍, ప్రైవేట్‍ స్కూళ్లలో ఇప్పటికే రివిజన్‍ పూర్తి చేశాం. మార్చి 16లోపు టెన్త్ రివిజన్‍ పూర్తి చేసే లక్ష్యంతోనే ప్రణాళికలు రూపొందించి అమలు చేశాం. ఇప్పటికే ప్రీ ఫైనల్‍ ఎగ్జామ్స్, రివిజన్‍ పూర్తి చేసినందున గవర్నమెంట్ ఇచ్చిన సెలవుల కారణంగా నష్టం కలిగే అవకాశం
ఉండదు. స్టూడెంట్స్ ఇంట్లో చదువుకునేలా చేయాలి.                                                       – బి.వెం కటనర్సమ్మ, డీఈఓ హైదరాబాద్‍