ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గింది. కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి. అయితే కోవిడ్ మందగిస్తున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం మనల్ని వదలదు అంటున్నారు నిపుణులు. కోవిడ్ ప్రభావం మనపై దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘకాలం ఉంటే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని అన్నారు.
కరోనా ప్రభావం ముఖ్యంగా వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉన్న గ్రూపుల్లో ఎక్కువగా ఉంటుందని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై టెడ్రోస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కామన్‌వెల్త్‌లోని జనాభాలో 42 శాతం మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్లు చెప్పారు. ఆఫ్రికన్ దేశాలు సగటున 23 శాతం వ్యాక్సినేషన్ రేటును సాధించినట్టు తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియలో దేశాల మధ్య ఈ వ్యత్యాసం తగ్గాలని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి: