- ఆరు నెలల్లో 30 ప్రేమ కేసులు
- పారిపోయి పెండ్లిళ్లు చేసుకున్న పలువురు
- పట్టుకొచ్చినా పారిపోతున్న మరికొందరు
- కౌన్సిలింగ్ ఇస్తున్న సీడబ్ల్యూసీ
యాదాద్రి, వెలుగు : సోషల్‌మీడియా ప్రభావం పిల్లలపై బాగా పడుతోంది. చాటింగ్ కారణంగా పిల్లలు ప్రేమలో పడుతున్నారు. దీంతో ఇండ్ల నుంచి పారిపోతున్నారు. యాదాద్రి జిల్లాలో ఈ ఏడాదిలో అనేకం చోటు చేసుకున్నాయి. చైల్డ్ప్రొటెక్షన్డిపార్ట్మెంట్లెక్కల ప్రకారం ప్రతినెలా 3 నుంచి 5 జంటలు ప్రేమ పేరుతో పారిపోతున్నాయి. ఆన్లైన్ చదువుల కోసం మొదలైన స్మార్ట్ ఫోన్ వాడకం.. ఇప్పుడు జీవితంతో పెనవేసుకుపోయింది. అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రా వంటి సోషల్‌మీడియా అకౌంట్లు ఒకటి కంటే ఎక్కువగానే ఉన్నాయి. అయితే 7 నుంచి ఇంటర్‌లోపు చదువుతున్న వారిపై సోషల్‌మీడియా ప్రభావం ఎక్కువగా పడుతోంది.
'హాయ్' చాటింగ్‌తో మొదలై.. ఫొటోల షేరింగ్ వరకూ వెళ్తోంది. వారి చాటింగ్ వ్యవహారాన్ని గమనించినచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఎక్కువ మంది తల్లిదండ్రుల మాటలను ఖాతరు చేయడం లేదు. కొందరు పారిపోయి ఏదో ఒక గుడిలో పెండ్లిలు చేసుకుంటున్నారు. అయితే నెలకు మూడు నుంచి ఐదుగురు మైనర్లు ఇండ్ల నుంచి పారిపోతున్నారని చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒకరు లేదా ఇద్దరూ మైనర్లు
ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకరి కంటే ఎక్కువ మందితో చాటింగ్..
కొందరు మైనర్లు ఒకరి కంటే ఎక్కువ మందితో చాటింగ్ చేస్తున్నారు. ఒకరికి తెలవకుండా మరొకరితో చాటింగ్ చేస్తూ కొన్నిసార్లు వేర్వేరుగా ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఒక మైనర్ ఏకంగా ఐదుగురితో చాటింగ్ చేస్తున్న విషయం తెలిసి మరో మైనర్ 'బ్లాక్ మెయిలింగ్' చేయడంతో అసలు విషయం బయట పడింది.
ఆరు నెలల్లో 30 మంది..
సోషల్‌మీడియా కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ప్రేమలో పడిన ఘటనలు 30 కంటే ఎక్కువే వెలుగు చూశాయి. ఇందులో ఒకే నెలలో 10 మంది మైనర్లు 'ప్రేమ'లో పడ్డారు. పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పలువురు పేరెంట్స్ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించారు. దీంతో పోలీసుల సాయంతో చిన్నారులను తీసుకొచ్చి చైల్డ్వెల్ఫేర్కమిటీ చైర్మన్జయశ్రీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ఇచ్చారు. కొందరిని పేరెంట్స్‌తో పంపగా, ఇంకొందరిని బాలసదనంలో చేర్చారు. మరికొందరిని కేజీబీవీ స్కూల్స్‌లో చేర్చారు. అయితే తమ 'సోషల్‌మీడియా ఫ్రెండ్'పై కేసు నమోదు చేయవద్దని కూడా కోరినట్టు తెలుస్తోంది. పరువు పోతుందేమోనని కొందరు చైల్డ్ ప్రొటెక్షన్డిపార్ట్మెంట్ను ఆశ్రయించడం లేదు.
పేరెంట్స్ప్రభావం కూడా..
సోషల్‌మీడియాతోపాటు పేరెంట్స్ప్రభావం చిన్నారులపై పడుతోంది. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేక, పిల్లల ముందే తిట్టుకోవడం, కొట్టుకోవడం చేస్తున్నారు. ఇద్దరిలో ఒకరు వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపడం వంటివి చేస్తున్నారు. దీంతో పిల్లలు కూడా 'దారి' తప్పుతున్నారు.
మైనర్లకు పెండ్లిండ్లు..
పిల్లల వ్యవహారాన్ని గమనించిన పెద్దలు, పరువు పోతుందన్న భయంతో మైనర్లకు పెండ్లిండ్లు చేస్తున్నారు. పెండ్లిండ్లు చేస్తే చివరకు సర్దుకుపోతారని పేరెంట్స్భావిస్తున్నారు. పెండ్లిని మైనర్లు వ్యతిరేకించినా పెద్దలు పట్టించుకోకపోవడంతో పిల్లలు మౌనంగా ఉండిపోతున్నారు. మరికొందరు తామే చైల్డ్ప్రొటెక్షన్డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చి పెండ్లిని అడ్డుకున్న సంఘటనలూ ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా అనేకమంది మైనర్లకు పెండ్లిలు చేస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన పెండ్లిలను చైల్డ్ ప్రొటెక్షన్డిపార్ట్మెంట్ ఆపగలిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 100కు పైగా మైనర్ల పెండ్లిండ్లను ఆపగలిగారు.
మైనర్లను జాగ్రత్తగా గమనించండి
వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల వైఖరిలో కొన్ని మార్పులు వస్తుంటాయి. స్మార్ట్ఫోన్వాడకంతోపాటు వారి సోషల్‌మీడియా అకౌంట్లను పరిశీలించాలి. ఎన్ని పనులున్నా.. పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించాలి. ఎక్కడ చేయి దాటిపోతారో..? అని చిన్నతనంలో పెండ్లిలు చేయొద్దు. సీడబ్ల్యూసీని సంప్రదిస్తే కౌన్సిలింగ్ఇచ్చి పిల్లల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తాం.
బండారు జయశ్రీ, చైర్మన్, సీడబ్ల్యూసీ, యాదాద్రి
పదో తరగతి అమ్మాయి. తల్లి లేదు.. తండ్రి ఒక్కడే ఉన్నాడు. అమ్మాయికి ఇన్స్ట్రాలో ఒక అబ్బాయి పరిచమయ్యాడు. ఇద్దరి మధ్య చాటింగ్కొనసాగింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఏర్పడి, పెండ్లి చేసుకుందామనుకున్నారు. అమ్మాయి తండ్రితో చెప్పింది. అతడికి ఏమీ అర్థంకాక స్నేహితుల సాయంతో చైల్డ్ ప్రొటెక్షన్స్టాఫ్ను కలిశాడు.
ఒక్కతే కూతురు. పేరెంట్స్గవర్నమెంట్ఉద్యోగులు. అమ్మాయికి ఇన్స్ట్రాలో ఏపీకి చెందిన ఒకరు పరిచమయ్యారు. ఇద్దరి మధ్య చాటింగ్జరిగింది. ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అమ్మాయి ఏపీకి వెళ్లి అబ్బాయిని కలిసింది. పెండ్లి చేసుకొని అబ్బాయి ఇంటికి వెళ్లారు. దీంతో వారు అమ్మాయి పేరెంట్స్‌కు సమాచారం అందించారు. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినా మళ్లీ పారిపోయింది. చివరకు బాలసదన్‌లో చేర్చారు.