ఐపీఎల్ మ్యాచుల్లో మరో మజా బ్యాటింగ్. చెన్నై వర్సెస్ గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్.. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీంలో.. ఓపెన్ రచిన్ రవీంద్ర తన సత్తా చాటాడు. విధ్వంసకరమైన బ్యాటింగ్ చూపించాడు. జస్ట్ 20 బంతుల్లోనే 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరంభం నుంచి ఫోర్లు.. సిక్సులతో గుజరాత్ జట్టుకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో స్టేడియం మొత్తాన్ని హోరెత్తించాడు. చెన్నై టీం హోంగ్రౌండ్ లో ఆడుతున్న మ్యాచ్ కావటంతో..చెన్నై పవర్ ప్లేలో మంచి ఆరంభం లభించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నైకు ఓపెనర్లు గైక్వాడ్, రచీన్ రవీంద్ర తొలి వికెట్ కు 62 పరుగులు జోడించారు. తొలి ఓవర్లో కేవలం రెండే పరుగులు వచ్చాయి. అయితే అసలు విధ్వంసం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. రెండో ఓవర్లో 12, మూడో ఓవర్లో 13, నాలుగో ఓవర్లో ఏకంగా 16 పరుగులు పిండుకున్నారు. దీంతో పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి 69 పరుగులు చేసింది. క్రీజ్ లో గైక్వాడ్(18) రహానే (2) ఉన్నారు.
A Huge cheer from the crowd for Rachin Ravindra after the innings. 👌
— Johns. (@CricCrazyJohns) March 26, 2024
- He is turning to crowd favourite in Chepauk. pic.twitter.com/pxD1RkYeuM