జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్

జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట: జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రారంభించి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం (జనవరి 23) కోదాడ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల లిస్టులో పేర్లు రానీ వారు ఆందోళన చెందొద్దని.. రేషన్ కార్డు జారీ నిరంతర ప్రక్రియ క్లారిటీ ఇచ్చారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి  రేషన్ కార్డుు అందుతోందని హామీ ఇచ్చారు. జనవరి 26 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు నాలుగు పథకాలను అమలు చేసి తీరుతామని.. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. 

పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ దద్దమ్మలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి పక్షాల మాటలు నమ్మి గందరగోళానికి గురి కావొద్దని ప్రజలకు సూచించారు.  ప్రజా సంక్షేమం కోసం నేను, నా సతీమణి పద్మావతి నిరంతరం పని చేస్తామని పేర్కొన్నారు.