రేపటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు

రేపటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు
  •     హ్యాండ్‌‌ బుక్ ఆవిష్కరించిన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో కొత్త క్రిమినల్‌‌ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హోంశాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ డా.జితేందర్ అన్నారు. జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త చట్టాలపై ప్రాసిక్యూషన్ డిపార్ట్‌‌మెంట్‌‌ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొత్త క్రిమినల్ చట్టాలతో కూడిన ప్రత్యేక హ్యాండ్‌‌ బుక్‌‌, ‘సమాహార’ అనే మొబైల్ అప్లికేషన్‌‌ను ఆయన శనివారం ఆవిష్కరించారు.

రాష్ట్ర ప్రాసిక్యూషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ డైరెక్టర్ వైజయంతి సహా ప్రాసిక్యూషన్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జితేందర్ వారిని అభినందించారు. మారిన చట్టాలు, సెక్షన్స్‌‌,శిక్షలు సహా పూర్తి వివరాలతో కూడిన సమగ్ర హ్యాండ్‌‌బుక్‌‌ను రాష్ట్ర ప్రాసిక్యూషన్స్ డిపార్ట్ మెంట్ హ్యాండ్‌‌బుక్‌‌ రూపంలో అందుబాటులోకి తెచ్చింది.