​మే 11 నుంచి 144  సెక్షన్ అమలు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఈసీ నిబంధనల మేరకు ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల ముందు నిలిపివేయాలని పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా పోలింగ్ రోజు, అలాగే పోలింగ్ కు ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని పేర్కొన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో (ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగం) మే 11 సాయంత్రం 4 గంటల నుంచి, మిగిలిన జిల్లాల్లో మే 11 సాయంత్రం 6  గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.