దేవుడికి ఎన్నో సార్లు మొక్కాం కానీ మా మొర ఆలకించడం లేదని అంటుంటారు కొందరు. భక్తితో మొక్కకేస్పొయినా, వాళ్లను మాత్రం లక్షణంగా చూస్తున్నాడని ఆరోపిస్తుంటారు ఇంకొందరు. రోజు గుడికి వెళ్లే వాళ్లు, ఇంట్లో పూజలు చేసి. భగవంతుడిని కొలిచే వాళ్లను పట్టించుకోవడం లేదని వాపోతుంటారు మరి కొందరు. ఆ దేవుడికి మా మీద ఇంకా యకలగలేదని మరికొందరు బాధపడుతూ ఉంటారు. నిజానికి పూజలు, వ్రతాలు, ప్రార్థన... దేవుడి మీద, సమ్మకంతో చేసేవి. మరి భగవంతుడు కరుణించాలంటే... మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. కృతజ్ఞతతో మెలగాలి.
దేవుడికి పూజలు చేసేటప్పుడు కోర్కెలు తీర్చమని అడిగేటప్పుడు మనసులో ఎలాంటి దురుదేశం ఉండకూడదు. అలాగే అవి ఇతరులకు కీడు చేసేవి కాకూడదు. సుఖాలు, సంతోషాలు కావాలని దేవుడిని అడగడం కంటే నీతి నిజాయితీతో ప్రవర్తిస్తామని.. దేపుడికి మాట ఇవ్వడం ముఖ్యం. భక్తులు దేవుడిపట్ల కృతజ్ఞతతో వ్యవహరి స్తారు. అందుకోసమే పూజలు ప్రార్థరలు, వ్రతాలు చేస్తారు. అలా కాకుండా ఐశ్వర్యం, ఉద్యోగం, పదవి లాంటివి ఇవ్వాలని అడగకూడదు.
తెలివి తేటలు, ప్రతిభతో మనిషి వాటిని సాధించుకోవాలి. “దేవుడా నీవే నాకు దిక్కు, నేనేం చేయను, నీవే నాకు అన్ని చేసిపెట్టాలి' అని మొక్కుకుంటే ఫలితం ఉండదని పురాణాలే చెప్తున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పక ప్రయత్నం చేయాలని సూచించాయి.
కృతజ్ఞత:
గుడికి వెళ్లినప్పుడు దేవుడిని పూజిస్తూ, లోపలున్న చెడు స్వభావాన్ని తొలగించుకోవాలని పురాణాలు చెప్తున్నాయి. దేవుడు గుడి మాత్రమే కాదు ప్రకృతిలోని ప్రతి ఒక్కటి పూజనీయమే. సాటి మన్సుషులు, చెట్లు, పుట్టలు, ఆకులు,నదులు.. అన్నీ.అందుకే. నదులు, చెట్లను పూజించే సంప్రదాయం వచ్చింది. అంటే మనిషి జీవించడానికి యోగపడే ప్రతిదానికీ కృతజ్ఞత తెలపాలి. పూజించడం. ప్రార్ధన చేయడం కూడా అలాంటివే.
మన వేదాలు, ఉపనిషత్తులు సృష్టిలోని ప్రతి దానిలోనూ భగవంతుడిని చూడాలని చెప్పాయి. ప్రతి ఒక్కరూ తనలాగే చూడగలిగితే జీవితం సంతోషంగా సాగిపోతుంది.ప్రకృతి పట్ల కృతజ్ఞతతో ఉండటం అంటే ప్రకృతిని నాశనం చేయకుండా. ప్రకృతితో కలిసి బతకడమే. అలా జీవించగలిగినప్పడే ఎలాంటి విపత్తులు రావు.
రైతుల పండుగ
సంక్రాంతి కూడా ప్రకృతికి కృతజ్ఞత చెప్తూ జరుపుకునే పండుగే. ఈ పండుగ నాటికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటారు. తమకు వ్యవసాయంలో సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతతో పూజిస్తారు. విత్తనం వేసింది మొదలు పంట నూర్పుళ్ళ వరకు సహాయం చేసినందుకు కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు.
అలాగే గంగిరెద్దుల హరిదాసులు, జంగాలు అందర ఈ పండగ రోజుల్లో కనిపిస్తారు. ప్రజలు సంతోషంగా వాళ్లకు దానధర్మాలు చేస్తారు. అందరూ కలిసి జీవించే సమైఖ్య జీవనానికి ప్రతీక సంక్రాంతి పండుగ. అలాగే దేవుడికి కృతజ్ఞతతో పూజలు చేస్తారు. కళ్లాపి చల్లడం. ముగ్గులు వేయడం. గొబ్బిళ్ళు పెట్టడం, పతంగులు ఎగరవేయడం. భోగిమంటలు వేయడం ద్వారా ఈ పండగ రోజుల్లో ప్రకృతిని అరాధిస్తారు. అందుకే ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని వాటి చెప్పే పండుగ ఇది.