- ప్రపంచంలో పెద్ద ఆర్చిపెలాగో ఇండనేషియా.
- ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా.
- జోగ్ జలపాతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
- నీలగిరి కొండలు పరిశిష్ట పర్వతాలకు ఒక మంచి ఉదాహరణ.
- పర్వతాల ఏర్పాటుకు సంబంధించిన రేడియో యాక్టివ్ సిద్ధాంతాన్ని కొబర్ ప్రతిపాదించారు.
- నాగరికత ఊయలలుగా మైదాన ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి.
- భూసంధి అంటే రెండు పెద్ద భూభాగాలను కలుపుతున్న చిన్న భూభాగం.
- ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీస్లాండ్.
- ఒక విశాలమైన సమతలం లేక ముఖ్యంగా సమతల ఉద్గమన ప్రదేశాన్ని పీఠభూమి అంటారు.
- సరస్సులను పూడ్చడం వల్ల ఏర్పడే మైదానాలను కరస్ట్ మైదానాలు అంటారు.
- ఏదైనా భూభాగాన్ని జలభాగం అన్ని వైపులా ఆవరించి ఉన్నప్పుడు దానిని ద్వీపం అంటారు.
- దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలు పరిపూర్ణమైన జిగ్సా పూరకాలుగా కనిపిస్తాయి.
- వ్యవసాయానికి అత్యంత అనువైనవి మైదానాలు.
- కొండలతో పర్వతాలు ఎత్తు విషయంలో విభేదిస్తాయి.
- హిమనీ నదాలు (గ్లేసియర్స్) పర్వతాల్లో ఉంటాయి.
- యాంగ్జీ నది చైనాలో ప్రవహిస్తోంది.
- ఐరోపాలోని ముఖ్యమైన పర్వతశ్రేణి ఆల్ఫ్స్.
- 600 మీటర్లకుపైగా ఎత్తు కలిగిన ఒక నిట్రమైన కొండను పర్వతం అని పిలుస్తారు.
- భూ ఉపరితలం కోతకు గురికావడాన్ని క్రమక్షయం అంటారు.
- క్రమక్షయ ప్రక్రియ తగ్గిపోయిన ఉపరితలం నిక్షేపణ ప్రక్రియ ద్వారా మళ్లీ నిర్మితమవుతుంది.
- శాశ్వతంగా గడ్డకట్టుకుపోయిన మంచు నదులను గ్లేసియర్స్ అంటారు.
- పసిఫిక్ మహా సముద్రంలో ఉండే మౌనా కీ అనే సముద్రం లోపలి పర్వతం ఎత్తు 10,205 మీటర్లు.
- ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థల్లో ఒకటి ఆరావళి.
- గుండ్రంగా ఉండి, తక్కువ ఎత్తు కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత
- శ్రేణి అయిన ముడత పర్వతాలు అపలేచియాన్స్ పర్వతశ్రేణి, ఉరల్ పర్వత శ్రేణి.
- ఖండ పర్వతాల్లో పైకి పొడుచుకు వచ్చిన ఖండాలను హార్ స్ట్స్ (భ్రంశోత్థిత) అంటారు.
- ఖండ పర్వతాల దిగువ ఖండాలను గ్రాబెన్ అంటారు.
- ఖండ పర్వతానికి ఉదాహరణ అయిన రైన్ వ్యాలీ జర్మనీలో ఉంది.
- ఖండ పర్వతానికి ఉదాహరణ అయిన వాస్గెస్ పర్వతం ఫ్రాన్స్‌లో ఉంది.
- అగ్ని పర్వతానికి ఉదాహరణ అయిన మౌంట్ కిలిమంజారో టాంజానియాలో ఉంది.
- అగ్ని పర్వతానికి ఉదాహరణ అయిన మౌంట్ ఫుజియామా జపాన్‌లో ఉంది.
- పరిసర ప్రాంతాలకు ఎగువన ఉండి, పైన చదునైన భూమిని కలిగిన ప్రాంతాన్ని పీఠభూమి అని పిలుస్తారు.
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పీఠభూమి టిబెట్ పీఠభూమి.
- బంగారం, వజ్రాల మైనింగ్‌కు ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఆఫ్రికన్ పీఠభూమి.
- సువర్ణరేఖ నదిపై ఉన్న హుండ్రు జలపాతం చోటానాగపూర్ పీఠభూమిలో ఉంది.
- శరావాతి నదిపై ఉన్న జోగ్ జలపాతం భారతదేశంలోని కర్ణాటక పీఠభూమిలో ఉంది.
- మైదానాలు సాధారణంగా సముద్ర మట్టం కంటే 200 మీటర్ల కంటే ఎత్తులో ఉండవు.
- మైదానాల్లో ఎక్కువ జనాభా ఉండటానికి అనువైన కారణం టెర్రాస్ సాగుకు అనువుగా ఉండటం.
- అవిచ్ఛిన్నమైన చదునైన లేదా అల్ప మట్టమైన నేల మైదానం.
- హిమాలయాలు, ఆల్ఫ్స్ పర్వతాలు ముడత పర్వతాలకు ఉదాహరణ.
- ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండేది పీఠభూమి.
- అత్యంత ఎత్తయిన టిబెట్ పీఠభూమి సముద్ర మట్టానికి 4000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో ఉంటాయి.