
1. గ్లోబల్ ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ అయిన సైయంట్ లిమిటెడ్, తన డీఈటీ వ్యాపారానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సుకమల్ బెనర్జీని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఆయన సైయంట్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డులో కూడా సేవలు అందిస్తారు. బెనర్జీకి ఈఆర్అండ్ డీ, టెక్నాలజీ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని సైయంట్తెలిపింది. ఆయన తన కెరీర్‌లో ఎక్కువ కాలం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పనిచేశారు.
2. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక ఆహార, పానీయాల వాణిజ్య ప్రదర్శన ‘గల్ఫ్‌ఫుడ్ 2025’లో తెలంగాణకు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ పాల్గొంది. దుబాయిలో కొత్త ఆఫీసును కూడా ఏర్పాటు చేశామని తెనాలి గ్రూప్ సీఎండీ మోహన్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
3. కస్టమ్ బయోప్రాసెసింగ్ప్రొవైడర్ ఫాక్స్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించింది. నగరంలోని సంస్థ ఆఫీసులోనే ఇది జరిగింది. పారిశ్రామిక నాయకులు, భాగస్వాములు, సంఘ సభ్యులు ఈ కార్యకమానికి హాజరయ్యారు. ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ఆధునిక పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్లైఫ్ సైన్సెస్ సొల్యూషన్ల గురించి అవగాహన కల్పించారు.
4. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వ ఐటీశాఖ, టీ–-హబ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో హైదరాబాద్‌లో "ఇన్నోవేషన్ నెక్సస్ - భద్రత, డేటా రక్షణ, ఏఐ ’’పై సమావేశం నిర్వహించారు. భద్రత, డేటా రక్షణ, ఏఐ తాజా ఆవిష్కరణలు, సవాళ్లను ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో నిపుణులు, పరిశ్రమ ప్రముఖులు ఈ రంగాలలో ఎదురయ్యే వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వివరించారు.