కార్తీకమాసం విశేషాలు.. ముఖ్యమైన రోజులు ఇవే.. 

కార్తీకమాసం విశేషాలు.. ముఖ్యమైన రోజులు ఇవే.. 

ఆశ్వయుజ మాసం దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసం  ప్రారంభమవుతుంది. కార్తీక మాసాన్ని విష్ణు మాసం అని కూడా అంటారు. క్రోధినామ సంవత్సరం ( 2024)  కార్తీక మాసం నవంబర్​ 2న ప్రారంభమమవుతుంది.  అయితే నవంబర్​ 1 వతేదీన పాడ్యమి ఘడియలు వచ్చినా సూర్యోదయంలో అమావాస్య ఘడియలే ఉన్నందున నవంబర్​ 2 నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలని పండితులు చెబుతున్నారు.  బ్రహ్మముహూర్తంలో  కార్తీక స్నానం.. కార్తీక దీపం వెలిగిస్తారు.  పరమేశ్వరునికి .... రాక్షస సంహారి విష్ణు పరమాత్మకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీకమాసం..  క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి సహా కార్తీకమాసంలో  ముఖ్యమైన రోజులు గురించి తెలుసుకుందాం      

Also Read :- ఇవాళ్టి( నవంబర్1) నుంచి యూపీఐ కొత్త రూల్స్             

  • నవంబరు 02....  స్థిరవారం ... నుండి కార్తీక మాసం మొదలవుతోంది.
  • నవంబరు 03 .... ఆదివారం ...యమవిదియ - భగినీహస్త భోజనం
  • నవంబర్ 04  ...  మొదటి    కార్తీక సోమవారం
  • నవంబరు 05....మంగళవారం.... నాగుల చవితి
  • నవంబర్​ 06.... బుధవారం.... నాగపంచమి
  • నవంబర్ 11.... రెండవ కార్తీక సోమవారం
  • నవంబరు 12.... మంగళవారం.... ఏకాదశి ... దీనినే  మతత్రయ ఏకాదశి అంటారు
  • నవంబరు 13 ....బుధవారం......       క్షీరాబ్ది ద్వాదశి దీపాలు
  • నవంబరు 15 .....శుక్రవారం ...-  కార్తీకపూర్ణిమ, జ్వాలాతోరణం  ( 365 వత్తులతో దీపాలు వెలిగిస్తారు)
  • నవంబర్ 18 ....కార్తీకమాసం......మూడో సోమవారం
  • నవంబర్​ 19 ..... మంగళవారం ....సంకటహర చతుర్థి ( వినాయకుడికి  గరిక సమర్పిస్తారు)
  • నవంబర్ 25 ......కార్తీకమాసం.... నాలుగో సోమవారం
  • నవంబర్ 26 .....  మంగళవారం ..... కార్తీక బహుళ ఏకాదశి
  • నవంబర్ 29 .... కార్తీక మాసం మాస శివరాత్రి
  • డిసెంబర్ 1.... ఆదివారం ... కార్తీక అమావాస్య