- మాగనూర్ స్కూల్‌ను పరిశీలించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్
మాగనూర్, వెలుగు : స్టూడెంట్ల భవిష్యత్ తనకు అత్యంత ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. నారాయణపేట జిల్లా మాగనూర్ హైస్కూల్‌లో స్టూడెంట్ల సమస్యలను తెలుసుకునేందుకు గురువారం ఆమె స్కూల్‌కు వచ్చారు. స్కూల్ ఆవరణను పరిశీలించిన అనంతరం స్టూడెంట్లతో మాట్లాడారు. పిల్లలకు మహిళా కమిషన్ అండగా ఉంటుందన్న నమ్మకం కలిగించేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
వంట కార్మికుల నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజన్ అవుతుందని స్టూడెంట్లు చెప్పారన్నారు. టీచర్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థులు కోరారని చెప్పారు. ఇంట్లో తమ పిల్లలకు ఎలా వండి పెడతామో స్కూల్‌లో కూడా అలాగే వంట చేయాలని సూచించారు. స్కూల్‌లో రాజకీయాలు మానుకొని, స్టూడెంట్లకు అందరూ సహకరించాలని కోరారు. పిల్లలపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత ఆఫీసర్లను హెచ్చరించారు.