Health Alert: మీ లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోకపొతే క్యాన్సర్ ఖాయం...

Health Alert: మీ లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోకపొతే క్యాన్సర్ ఖాయం...

వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. క్యాన్సర్ పట్ల కనీస అవగాహన లేక చాలా మంది చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. అయితే, మన లైఫ్ స్టైల్ లో చిన్న మార్పులు చేసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడచ్చు. ముఖ్యంగా 20ఏళ్ళ నుండి 30, 40ఏళ్ళ వయసు గల వారు లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకొని జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ కి దూరంగా ఉండచ్చు.

20 నుండి 40 ఏళ్ళ వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

హెల్తీ డైట్ మెయింటైన్ చేయటం: పండ్లు, కూరగాయలు, హోల్ గ్రైన్స్ తో పాటు లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్‌ల వినియోగం వీలైనంత తగ్గించటం ఆల్కహాల్ కి దూరంగా ఉండటం కూడా మంచిది.

రెగ్యులర్గా వ్యాయామం చేయటం: ప్రతిరోజూ కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయటం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయటం ద్వారా బరువును నియంత్రించటమే కాకుండా వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

స్మోకింగ్ కి దూరంగా ఉండటం: ధూమపానం మరియు పొగాకు వినియోగం క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని చెప్పచ్చు... ధూమపానం అలవాటు ఉంటే, మానేయడానికి ప్రయత్నించండి. అంతే కాకుండా సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ కి కూడా దూరంగా ఉండండి

చర్మ సంరక్షణ: అధిక SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. శుభ్రమైన దుస్తులను ధరించటం, బెడ్ ని శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా చర్మ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చు.

టీకాలు తీసుకోవడం: HPV వ్యాక్సిన్ వంటి టీకాలు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి. డాక్టర్ ని సంప్రదించి ఎప్పటికప్పుడు అవసరమైన టీకాలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడచ్చు.

రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం: 30ఏళ్ళ వయసు దాటిన ప్రతిఒక్కరు తప్పకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. తద్వారా క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టి ప్రమాదం నుండి బయటపడవచ్చు.

స్ట్రెస్ మేనేజ్మెంట్: స్ట్రెస్ ఎక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్ట్రెస్ వల్ల వచ్చే ప్రధాన సమస్యల్లో క్యాన్సర్ ఒకటి, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఫాలో అవ్వటం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుండి బయటపడచ్చు.