- ఫైనల్లో 30 రన్స్ తేడాతో రాజస్తాన్‌పై గెలుపు
రాజ్‌కోట్ : ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న హర్యానా.. విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 30 రన్స్ తేడాతో రాజస్తాన్‌పై గెలిచింది. టాస్ గెలిచిన హర్యానా 50 ఓవర్లలో 287/7 స్కోరు చేసింది. అంకిత్ కుమార్ (88), అశోక్ మనేరియా (70) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, నిశాంత్ సింధు (29), సుమిత్ కుమార్ (28 నాటౌట్), రాహుల్ తెవాటియా (24) అండగా నిలిచారు.
రాజస్తాన్ బౌలర్లలో అనికేత్ చౌదరీ 4, అరాఫత్ ఖాన్ 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో రాజస్తాన్ 48 ఓవర్లలో 257 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్ అభిజిత్ తొమర్ (106) సెంచరీతో చెలరేగినా లాభం లేకపోయింది. కునాల్ సింగ్ రాథోర్ (79) మినహా మిగతా వారు నిరాశపర్చారు. సుమిత్ కుమార్, హర్షల్ పటేల్ చెరో మూడు, అన్షుల్ కాంబోజ్, రాహుల్ తెవాటియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.