ఓల్డ్ నల్లగుట్టలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోయిగూడ, మేకల మండి, ఓల్డ్ నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇష్వా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహించారు. విద్యార్థుల క్లాసికల్ డ్యాన్సులు ఆకట్టుకున్నాయి.
ఫౌండేషన్ నిర్వాహకులు హైమంతి,శిల్ప,మాధురి, హెడ్మాస్టర్ చిన్నా బత్తిని శౌరి, ఆయా పాఠశాలల టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
– పద్మారావునగర్, వెలుగు