అంబేద్కర్​ కాలేజీలో ఆకట్టుకున్న ఫుడ్​ కార్నివాల్

అంబేద్కర్​ కాలేజీలో ఆకట్టుకున్న ఫుడ్​ కార్నివాల్

వెలుగు, ముషీరాబాద్ :  బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్​లో శుక్రవారం నిర్వహించిన ‘ఫుడ్​కార్నివాల్’​​ ఆకట్టుకుంది. ఇంటర్ ప్రీమియర్ షిఫ్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బిజినెస్ ఐడియాలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 600 మంది స్టూడెంట్లు కలిసి 40కి పైగా ఫుడ్​స్టాల్స్​ఏర్పాటు చేశారు.

ముఖ్యఅతిథిగా మాజీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొని ప్రారంభించారు. ట్రెండ్​కు తగ్గట్టుగా ఫుడ్ ఐటమ్స్​ తయారు చేసి స్టాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ చారి, కాలేజీ డైరెక్టర్ వై.విష్ణుప్రియ, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.